టెంపరరీ ఫోన్ నెంబర్ కావాలా? బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

temporary phone number: కొందరికి బర్నర్ (టెంపరరీ) ఫోన్ నెంబర్ అవసరం. మీ ప్రైమరీ నెంబర్‌కి స్పామ్ కాల్స్ మరియు మెసేజ్‌లు రావడం నివారించడానికి, లేదా పర్సనల్ నెంబర్‌ని దూరంగా ఉంచుకోవాలనిపించినప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

temporary phone number: బర్నర్ ఫోన్ నెంబర్ అనేది మీ ప్రైమరీ నెంబర్‌ని సురక్షితంగా ఉంచుతుంది. మీ నమ్మకమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ వ్యాసంలో, మీ కోసం ఉత్తమమైన 10 బర్నర్ ఫోన్ యాప్‌లను అందించాము.

Hushed – సెకండరీ ఫోన్ నెంబర్- free temporary number

Hushed యాప్ మీకు తాత్కాలికంగా రెండవ ఫోన్ నెంబర్‌ను అందిస్తుంది. 3 రోజులు ఉచితంగా ట్రయల్ ఉపయోగించుకోవచ్చు, ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. Hushedలో మీరు కస్టమైజ్ చేయగలిగే వాయిస్ మెయిల్ గ్రీటింగ్స్, ఆటో-రిఫ్లై టెక్స్ట్‌లు, కాల్ ఫార్వార్డింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

Doosra: burner number india

భారతదేశంలో ఉన్న వారికి, Doosra అనేది ఒక ప్రముఖ వర్చువల్ ఫోన్ నెంబర్ యాప్. ఈ యాప్‌లో కాల్ మరియు మెసేజ్‌ల కోసం పలు ప్రాథమిక ఫీచర్లు ఉంటాయి. మీ ప్రియమైన వ్యక్తుల నుంచి మాత్రమే కాల్స్ రావాలనుకుంటే, Doosra యాప్ యొక్క “స్మార్ట్ ఫిల్టర్” ఉపయోగించవచ్చు.

Google Voice- free temporary phone number

Google Voice ప్రస్తుతం US మరియు కెనడా వరకు మాత్రమే పరిమితం. కానీ భవిష్యత్తులో భారతదేశంలో కూడా అందుబాటులోకి రానుంది. యాప్‌లో అనవసరమైన యాడ్స్ లేకుండా, యూజర్ ఇంటర్‌ఫేస్ సులభంగా వాడుకోగలిగేలా ఉంటుంది.

Burner- free burner number app

Burner యాప్‌ను మీరు డౌన్‌లోడ్ చేసిన తర్వాత 7 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది. ఈ యాప్‌తో మీరు ఒకటి కాదు, అనేక ‘బర్నర్’ నెంబర్‌లను సృష్టించి, అవసరం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు.

2nd Line- free burner phone number

2nd Line యాప్ పూర్తిగా ఉచితంగా వాడుకోవచ్చు. యాప్‌లో యాడ్స్ చూడాల్సి వస్తుంది.

కానీ ప్రాథమిక ఫీచర్లు ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.

Dingtone- app for temporary phone number

Dingtone యాప్‌లో సైన్ అప్ చేసిన వెంటనే ఒక తాత్కాలిక నెంబర్ లభిస్తుంది.

ఈ నెంబర్‌తో మీరు కాల్స్ చేయడమే కాకుండా, టెక్స్ట్‌లు పంపవచ్చు.

Line2

మీ వ్యాపారం లేదా స్టార్టప్ కోసం తాత్కాలిక ఫోన్ నెంబర్ అవసరం ఉంటే, Line2 అనేది మంచి ఎంపిక. కస్టమర్ సపోర్ట్ వంటి సేవల కోసం ఇది అనువుగా ఉంటుంది.

Grasshopper

చిన్న వ్యాపారాల యజమానులకు అనుకూలంగా Grasshopper యాప్ ఉంది. ఎం‌ఎం‌ఎస్‌లు, గ్రూప్ మెసేజ్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

Text Free

Text Free యాప్‌లో మీరు ఉచితంగా ఒక నిజమైన ఫోన్ నెంబర్ పొందవచ్చు. ఈ నెంబర్‌ను బర్నర్‌గా లేదా వ్యాపార నెంబర్‌గా వాడుకోవచ్చు.

Cloud SIM

Cloud SIM యాప్ ద్వారా ఒకటి కాదు, నాలుగు వరకు బర్నర్ నెంబర్‌లు సృష్టించుకోవచ్చు. అంతర్జాతీయ కాల్స్ కూడా ఈ యాప్ ద్వారా తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.

ముగింపు

మొత్తం మీద, బర్నర్ ఫోన్ నెంబర్ యాప్‌లు ఎక్కువగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సినవి.

కానీ Doosra మరియు 2nd Line వంటి యాప్‌లు ప్రాథమిక సేవలను ఉచితంగా అందిస్తాయి.

Also Read: గర్ల్ఫ్రెండ్ బ్లాక్ చేసిందా? ఇలా ఈజీగా కాల్ చేస్కోండి

More From Author

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *