ఫోన్ చోరీ గుర్తించే ఏఐ- ఆండ్రాయిడ్​లో ఇలా సెట్ చేసుకోండి!

phone theft protection- స్మార్ట్‌ఫోన్ చోరీ అనేది ఎవరూ ఎదుర్కొనాలని అనుకోరు. కానీ చాలా సార్లు ఫోన్ అనుకోకుండా తప్పు చేతుల్లో పడవచ్చు. అయితే, ఫోన్ మాత్రమే కాదు. దాని లోపల ఉన్న కీలకమైన డేటా కూడా ఒక ప్రధాన సమస్యగా మారుతుంది.

phone theft protection- మన ఫోన్లు వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంక్ ఖాతాల వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక సమాచారం వంటివి చాలా ఉంటాయి. ఇవి దొంగ చేతుల్లో పడితే చాలా ప్రమాదం.

దాంతో, ఫోన్‌ను కోల్పోయిన సమయంలో తక్షణమే డేటాను కాపాడుకోవడం చాలా ముఖ్యమైంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు గూగుల్ కీలకమైన భద్రతా ఫీచర్లను తీసుకువస్తోంది.

లేటెస్ట్ అప్​డేట్- android phone theft

అయితే, Xiaomi 14T Pro ఫోన్‌లో ఇటీవల అప్‌డేట్‌లో Theft Detection Lock మరియు Offline Device Lock అనే రెండు కొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఓ నిపుణుడు Redditలో పంచుకున్నారు. గూగుల్ ఈ ఫీచర్లను మొదట మే నెలలో ప్రకటించింది. మరికొన్ని సందర్భాల్లో, కొంతమంది వినియోగదారులు మూడవ ఫీచర్ అయిన రిమోట్ లాక్‌ను మాత్రమే చూశారు.

ఏఐ ఆధారిత లాక్- android phone stolen

  • Theft Detection Lock అనే ఈ ప్రత్యేక ఫీచర్ గూగుల్ AI ఆధారంగా పని చేస్తుంది. ఇది ఒక వినూత్నమైన భద్రతా లక్షణం.
  • ఫోన్ చోరీ చేసే సందర్భంలో, దానిని గుర్తించి, స్క్రీన్‌ను లాక్ చేయడం ద్వారా డేటాను దొంగలకు అందకుండా అడ్డుకుంటుంది.
  • AI సాయంతో చోరీకి సంబంధించిన ప్రత్యేక కదలికలను ఈ ఫీచర్ గుర్తిస్తుంది.
  • ఉదాహరణకు, ఎవరో ఎత్తుకెళ్లి బైక్ లేదా కార్ మీద పారిపోతే, ఫోన్ వెంటనే స్క్రీన్‌ను లాక్ చేస్తుంది.
  • దాంతో దొంగలకు ఫోన్‌ని అన్లాక్ చేయడం చాలా కష్టం అవుతుంది.

ఆన్​లైన్​లో లేకున్నా సరే- android lost phone

Offline Device Lock ఫీచర్ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది.

  • ఫోన్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ కాకపోయినా,
  • దొంగలు ఎక్కువ సార్లు పిన్ లేదా పాస్‌వర్డ్‌ని వేసి ప్రయత్నిస్తే,
  • లేదా ఫోన్‌ని డేటా కనెక్టివిటీ నుంచి చాలా సేపు డిస్కనెక్ట్ చేసి ఉంచితే ఈ ఫీచర్ స్క్రీన్‌ని లాక్ చేస్తుంది.
  • దీని ద్వారా డేటా సురక్షితంగా ఉంటుంది.

రిమోట్ లాక్- android theft lock

మూడవ ఫీచర్ అయిన రిమోట్ లాక్ ఫోన్‌ను కోల్పోయినప్పుడు ఉపయోగపడుతుంది. ఫోన్ పోయినప్పుడు, మీ ఫోన్ నంబర్ మరియు ఒక చిన్న భద్రతా పరీక్ష ద్వారా ఫోన్ స్క్రీన్‌ను రిమోట్‌గా లాక్ చేయవచ్చు.

ఫైండ్ మై డివైస్ అనే సదుపాయాన్ని ఉపయోగించి, మీరు మీ ఫోన్‌ని పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. ఫోన్‌లో ఉన్న డేటాను తక్షణమే శుభ్రం చేయవచ్చు.

ఈ వెర్షన్​లకు మాత్రమే- android stolen phone protection

ఈ ఫీచర్లు అన్ని ఆండ్రాయిడ్ 10 లేదా పై వెర్షన్లలో గూగుల్ ప్లే సర్వీసెస్ అప్‌డేట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వినియోగదారులు ఫోన్ చోరీ అయినా, వారి డేటా సురక్షితంగా ఉండేలా చూసుకోవచ్చు.

Also Read: TWSలపై ఆఫర్- రూ.3వేలలో బెస్ట్ ఇవే

More From Author

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *