pebble ultra life దేశీయ బ్రాండ్ పెబుల్ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. పెబుల్ అల్ట్రా లైఫ్ అనే పేరుతో వాచ్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
pebble ultra life దీర్ఘకాలం ఉండే బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ గురించి వింటే దిమ్మ తిరగాల్సిందే. ఆ కొత్త వాచ్ వివరాలు ఇక్కడ చూద్దాం.
పెబుల్ అల్ట్రా లైఫ్ స్మార్ట్‌వాచ్: ధర, లభ్యత
- పెబుల్ అల్ట్రా లైఫ్ స్మార్ట్‌వాచ్ ప్రారంభ రాయితీ ధర రూ. 1,600 వద్ద అందుబాటులో ఉంది.
- కస్టమర్లు ఈ వాచ్‌ను ప్రత్యేకంగా కంపెనీ వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.
- పెబుల్ కంపెనీ వెబ్‌సైట్ www.pebblecart.com.
డిస్ప్లే
- ఈ కొత్త స్మార్ట్‌వాచ్ 1.83-అంగుళాల స్క్వేర్ HD డిస్ప్లే కలిగి ఉంది.
- ఇది గరిష్ఠంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ
- పెబుల్ అల్ట్రా లైఫ్ 600 mAh బ్యాటరీని కలిగి ఉంది.
- ఇది ఒకసారి చార్జ్ చేస్తే 12 రోజుల వరకు పనిచేస్తుంది.
- స్టాండ్‌బైలో బ్యాటరీ లైఫ్ 20 రోజుల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఈ ఫీచర్లు కూడా
- ఈ స్మార్ట్‌వాచ్ మాగ్నెటిక్ ఛార్జింగ్, డస్ట్, స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ వంటి ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంది.
- అల్ట్రా లైఫ్‌లో హై-గ్రేడ్ సెన్సార్లు, హార్ట్ రేట్ మానిటరింగ్, పలు క్రీడా రీతులు ఉన్నాయి.
- DIY వాచ్ ఫేస్‌లను కూడా పెబుల్ అల్ట్రా లైఫ్ సపోర్ట్ చేస్తుంది.
- జెట్ బ్లాక్, టీల్ బ్లూ, మిస్టీ గ్రే అనే 3 రంగుల్లో అందుబాటులో ఉంది.
- స్మార్ట్ కేలిక్యులేటర్, వాయిస్ అసిస్టెంట్, అలారం, నోటిఫికేషన్‌లు వంటి ఇతర ఫీచర్లను కూడా ఈ స్మార్ట్‌వాచ్ అందిస్తుంది.
పాన్-ఇండియా బ్రాండ్
స్మార్ట్‌వాచ్ ప్రారంభించడంపై, మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడు, CEO అయిన అనంత్ నారాయణన్ మాట్లాడుతూ: “పెబుల్ గ్లోబల్ పర్స్పెక్టివ్ కలిగిన పాన్-ఇండియా బ్రాండ్‌గా రూపుదిద్దుకుంది. ప్రతి కొత్త ఉత్పత్తి ప్రారంభంతో, అది తన ప్రతిభను నిరూపించుకుంటోంది. శైలి, ఫీచర్లు, అనుకూలమైన ధరల సరైన కలయిక బ్రాండ్‌ను వినియోగదారులను చురుగ్గా ఆకట్టుకుంటుంది. ఇకముందు ఇన్నోవేషన్ పరంగా స్థాయిని పెంచుతాం.”
ప్రపంచంతో కనెక్ట్ అవుతాం!
అయితే, పెబుల్ సహ-వ్యవస్థాపకుడు కోమల్ అగర్వాల్ మాట్లాడుతూ: “పెబుల్ అల్ట్రా లైఫ్ అనేది ఎల్లప్పుడూ చురుకుగా ఉండే యువత మాదిరిగా ఉండే ఆఖరి స్మార్ట్‌వాచ్. మేము ఎల్లప్పుడూ ప్రపంచంతో కనెక్ట్ కావాలని కోరుకుంటున్నప్పటికీ, కొన్నిసార్లు మీ స్మార్ట్‌వాచ్‌ను ఛార్జ్ చేయడం వంటి అనేక ఇతర పరికరాలను ఛార్జ్ చేయడం కష్టంగా మారుతుంది. దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ఈ పరికరం తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.”
దూసుకెళ్తున్న పెబుల్
కాగా, మార్కెట్ పరంగానూ పెబుల్ ఇండియాలో దూసుకెళ్తోంది. ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ఈ స్మార్ట్‌వాచ్‌లు యూత్‌తో పాటు అన్ని వయసుల వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సో, మీకూ ఈ వాచ్ నచ్చితే కొనేయంటి. ఈ ధర కొద్దిరోజుల్లో పెరిగే అవకాశం ఉంది.