ola service issues- ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్, ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా సోషల్ మీడియా వేదికపై గట్టి వాదనకు దిగారు. కునాల్ కమ్రా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సేవా కేంద్రాల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
ola service issues- కమ్రా X (ట్విట్టర్) వేదికగా ఓలా సేవా కేంద్రం ముందు నిలబెట్టిన భారీ సంఖ్యలోని స్కూటర్ల ఫోటోని షేర్ చేస్తూ విమర్శలు చేశారు. “ఇండియన్ కస్టమర్లు ఇలాంటి సేవలకు అర్హులా? ద్విచక్ర వాహనాలు రోజూవారీ పనులు చేసుకునే వారి జీవితాల్లో చాలా కీలకం” అంటూ విమర్శించారు.
కేంద్రంపై అసంతృప్తి! Ola bikes problems
అంతేకాకుండా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేసి కేంద్ర ఈవీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇలాంటివి చూస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎలా పెరుగుతుందో తెలుసుకోవాలని ఉంది. @jagograhakjago ఈ విషయం గురించి మీరేమన్నా చెప్పగలరా?” అని ప్రశ్నించారు.
భవీష్ అగర్వాల్ స్పందన– bhavish aggarwal on Ola service issues
కునాల్ చేసిన ఈ ట్వీట్స్‌పై భవీష్ అగర్వాల్ తీవ్రంగా స్పందించారు. కమ్రాపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు. కమ్రా పెయిడ్ పోస్ట్‌లు చేస్తున్నారని ఆరోపించారు.
“@kunalkamra88, మీరు ఇంత బాధపడుతున్నారా? అలాగైతే మా సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయండి! మీ పెయిడ్ ట్వీట్‌కన్నా, మీ విఫలమైన కమెడీ కెరీర్ కన్నా ఎక్కువ చెల్లిస్తాను. లేదంటే సైలెంట్‌గా కూర్చోండి, నిజమైన కస్టమర్ల కోసం మేము సమస్యలు పరిష్కరించడంలో దృష్టి పెట్టాలి. త్వరలోనే మేము మా సేవా నెట్వర్క్‌ను విస్తరిస్తాం, ఉన్న బ్యాక్లాగ్‌లు తొలగిస్తాం” అని అన్నారు.
కమ్రా రిప్లై – Ola service issue kunal kamra
భవీష్ తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలపై కమ్రా స్పందించారు. “”పెయిడ్ ట్వీట్, విఫలమైన కమెడీ కెరీర్ & ప్రశాంతంగా కూర్చోండి.” ఓ భారత వ్యాపారవేత్త నుంచి చాలా గౌరవంతో వచ్చిన రిప్లై చూస్తున్నాం. మీ ఆరోపణలు నిజమైతే, నా సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ తొలగిస్తాను. ప్రైవేట్ కంపెనీలపై నేను ఎప్పుడైనా చేసిన వ్యాఖ్యలకు నేను డబ్బు తీసుకుంటే చర్చకు రండి” అన్నారు.
దీనికి అగర్వాల్ మరోసారి స్పందిస్తూ, “గాయం అయ్యిందా? నొప్పి అనిపించిందా? రా సర్వీస్ సెంటర్‌కి. చాలా పని ఉంది. నీ ఫ్లాప్ షోల కన్నా ఎక్కువగా ఇక్కడ డబ్బు ఇస్తాను. నిజమైన కస్టమర్‌లకు మా వద్ద సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు నిజమైన కస్టమర్ అయితే ఈ విషయాలు మీకు తెలిసి ఉండేవి” అని కౌంటర్ ఇచ్చారు.
నెటిజన్ల అభిప్రాయం ఇదే- Ola service quality
ఈ ప్రకంపనలు సోషల్ మీడియా వేదికపై భారీ చర్చకు దారితీశాయి. పలువురు నెటిజన్లు ఓలా స్కూటర్లపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఓలా సర్వీస్ క్వాలిటీ నిజంగానే బాలేదని పేర్కొన్నారు. ఓలా అనేది ఇండియాలో పెద్ద స్కామ్ అని, ఇంకొన్ని రోజుల్లో ఈ స్కామ్ పూర్తిగా బయటపడుతుందని చెప్పుకొచ్చారు. సమస్య గురించి ప్రస్తావిస్తే.. సీఈఓ ఈవిధంగా స్పందించడం విడ్డూరమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఓలా పెయిడ్ క్యాంపెయిన్- Ola paid promotions
మరికొందరు నెటిజన్లు.. పెయిడ్ ట్వీట్లు చేయాలని ఓలా నుంచి తమకు వచ్చిన మెసేజ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఓవైపు ఓలాకు అనుకూలంగా పెయిడ్ క్యాంపెయిన్ నడిపిస్తూ.. నెగిటివ్ రివ్యూలపై తిరిగి పెయిడ్ పోస్ట్ అని ముద్ర వేయడం షాకింగ్ గా ఉందని పేర్కొన్నారు.