mahindra thar roxx మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ SUV అధికారికంగా విడుదలైంది. ఇది 2024లో అత్యధిక మంది ఎదురుచూస్తున్న కార్లలో ఒకటి. అంతే కాదు, నాలుగేళ్ల క్రితం ఆగస్టు 15న థార్ 3- డోర్ ఎస్యూవీ విడుదల కాగా, ఇప్పుడు అదే మోడల్ సరికొత్త వెర్షన్‌తో ముందుకొచ్చింది. డిజైన్, ఫీచర్స్, ధర విషయంలో ఆకట్టుకునేలా ఉండటం థార్ సానుకూలత. దీంతో థార్ రాక్స్-5 ఎస్యూవీ కోసం వెయి కళ్లతో ఎదురుచూశారు కార్ లవర్స్. వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది.
mahindra thar roxx డిజైన్, పెర్ఫార్మెన్స్ థార్ రాక్స్ అద్భుతమైన ఫీచర్లుగా చెప్పుకోవచ్చు. థార్ 3-డోర్‌తో పోలిస్తే ఫీచర్ల విషయంలో ఇది ఓ రెండు మెట్లు పైనే అని చెప్పుకోవచ్చు. బేస్ పెట్రోల్ మోడల్ ధర ₹ 12.99 లక్షలు మరియు బేస్ డీజిల్ మోడల్ ధర ₹ 13.99 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. మిడ్ మరియు టాప్-స్పెక్ వేరియంట్‌ల ధరలు ఆగస్టు-15న వెల్లడిస్తారు.
మహీంద్రా థార్ రాక్స్ డిజైన్
ప్రేక్షకులు ఆశించిన విధంగా కాకుండా మహీంద్రా థార్ రాక్స్ డిజైన్ కాస్త మార్చినట్లు స్పష్టమవుతోంది. వెనుక క్వార్టర్ గ్లాస్ తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. హార్డ్-టాప్ ట్రిమ్‌పై ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే, థార్ రాక్స్ వంగిన రూఫ్‌ను కలిగి ఉంది. ఈ విషయంలో మాత్రం అంతర్జాలంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 3-డోర్ థార్ మోడల్‌తో పోలిస్తే తాజా థార్ రాక్స్‌లో అల్లాయ్ వీల్ డిజైన్ తీసుకొచ్చారు. అదనంగా, 3-డోర్ థార్‌లో వృత్తాకార వెనుక వీల్ ఆర్చెస్ ఇప్పుడు స్క్వేర్ వీల్ మోడల్‌గా మార్చారు.
మహీంద్రా థార్ రాక్స్ ఇంజిన్ ఎంపికలు
థార్ రాక్స్ అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఆటోమొబైల్ నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం థార్ రాక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
మహీంద్రా థార్ రాక్స్‌లో రెండు రకాల ఇంజిన్ వేరియంట్లు ఉంటాయి. ఒకటి – 2.0L టర్బో-పెట్రోల్ కాగా మరొకటి 2.2L టర్బో-డీజిల్.
- పెట్రోల్ వేరియంట్లో రెండు రకాలు ఉన్నాయి. 160 Hp మరియు 170 Hp.
- ఆయిల్ బర్నర్ కూడా రెండు ట్యూన్‌లలో అమ్మబడుతుంది – 132 Hp మరియు 171hp.
- అదనంగా, రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉంటాయి – 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AT.
మహీంద్రా థార్ రాక్స్ ఆఫ్-రోడ్ పరికరాలు
- థార్ 5-డోర్ ఆవిష్కరణ, రానున్న 3-డోర్ మోడల్ కంటే మరింత అభివృద్ధి చెందిన సస్పెన్షన్ సెటప్‌తో కూడి ఉంటుంది.
- ఇది స్కార్పియో-ఎన్ నుండి ఉద్భవించిన FSD షాక్ అబ్జార్బర్లను వెనుక పెంటా-లింక్ సస్పెన్షన్ సెటప్‌తో ఉపయోగిస్తుంది.
- అదనంగా, ఇది ముందు ఎలక్ట్రానిక్ బ్రేక్-లాకింగ్ డిఫరెన్షియల్ మరియు వెనుక మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ కలిగి ఉంటుంది.
- ఇంకా, ఇది తక్కువ-రేషన్ ట్రాన్స్ఫర్ కేస్‌ను కలిగి ఉంటుంది, థార్ 3-డోర్ మాదిరిగానే.
- ఆఫ్‌రోడ్ క్రాల్ కంట్రోల్ మరియు ఇంటెల్లీ-టర్న్ అసిస్టెంట్ ఫీచర్ జాబితాలో ఉన్నాయి.
- సంఖ్యల విషయానికి వస్తే, బ్రేకోవర్ యాంగిల్ ఇప్పుడు 23.6 డిగ్రీలు, అప్ప్రోచ్ యాంగిల్ 41.3 డిగ్రీలు మరియు డిపార్చర్ యాంగిల్ 36.1 డిగ్రీలు.
- అలాగే, ఇది 650 మిమీ నీటిలో దిగజారే సామర్థ్యం కలిగి ఉంటుంది.
Also Read: టాప్-6 డైలీ యూజ్ కార్లు- ఆఫీస్‌కు ఇవే బెస్ట్