chatgpt aadhaar card misuse : రోజువారీ జీవితంలో మనకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్న చాట్‌జీపీటీతో మరో సమస్య వచ్చి పడింది. ఈ టూల్ సైబర్ నేరస్థులకు ఓ వరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
chatgpt aadhaar card misuse : నకిలీ ఆధార్ కార్డులను, నకిలీ ఓటర్ కార్డులను ఇది క్రియేట్ చేస్తుండటం ఇప్పుడు కలవరపెడుతోంది. ఫేకు వీరులు గంటలు గంటలు ప్రయత్నించి క్రియేట్ చేసే నకిలీ డాక్యుమెంట్లను ఇది ఇట్టే చేసి పెట్టడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
AI fake aadhaar card chatgpt
ఘిబ్లీ యానిమేషన్ ఫొటోలతో ఇంటర్నెట్ను షేక్ చేసిన చాట్‌జీపీటీ ఇప్పుడు అత్యంత కచ్చితత్వంతో కూడిన నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తోంది. ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు.. నకిలీ ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డులను క్రియేట్ చేసేస్తోంది.
fake aadhaar card chatgpt
నిజమైన ఒక వ్యక్తి వివరాలు ఇచ్చి డాక్యుమెంట్ తయారు చేయమని అడిగితే చాట్‌జీపీటీ ఆ డాక్యుమెంట్‌ను క్రియేట్ చేయలేకపోయింది.
కానీ, సెలబ్రిటీలు, ఫేమస్ పర్సన్స్ ఫేక్ డాక్యుమెంట్లను క్షణంలో తయారు చేసింది. దీంతో చాట్‌జీపీటీ వల్ల ఎదురయ్యే సమస్యల్లో ఇదీ ఒకటిగా మారింది.
Fake Aadhaar IDs chatgpt
ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే చేసిన ఓ టెస్ట్‌లో ఈ షయాలు బయటపడ్డాయి. ఒక ఫేక్ ఆధార్ కార్డును క్రియేట్ చేయాలని కోరగా.. అది అచ్చుగుద్దినట్టు తయారు చేసింది.
సుశిక్షితులైన వారు మాత్రమే అది నకిలీదో, అసలైనదో గుర్తించే విధంగా ఆ ఆధార్ కార్డు ఉంది.
ఆధార్ మాత్రమే కాదు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటర్ కార్డును సైతం రూపొందించింది.
ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీని ఉపయోగించుకొని సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోదీ ఫేక్ ఐడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్ ఐడీని సైతం చాట్‌జీపీటీ క్రియేట్ చేసింది. తొలుత ఇందుకు నిరాకరించిన చాట్‌జీపీటీ.. ఎర్రర్ మెసేజ్ ఇచ్చింది. అయినప్పటికీ, క్రియేట్ చేయాల్సిందేనని కోరగా.. మోదీ పేరు, ఫొటోతో కూడిన నకిలీ ఓటర్ కార్డును తయారు చేసింది.
- అంతేకాదు, నకిలీ పేమెంట్ రిసీట్లను కూడా చాట్‌జీపీటీ క్రియేట్ చేయడం ఆందోళనకరంగా మారింది.
- పేటీఎం ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్‌ను అచ్చుగుద్దినట్టు, ఏ మాత్రం తేడా తెలియనీయకుండా తయారు చేసింది చాట్‌జీపీటీ.
- మరోవైపు, ఓ ట్విట్టర్ యూజర్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ బ్యాచిలర్ డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్‌ను క్రియేట్ చేశాడు.
నకిలీ పత్రాలు ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడ్డ ఘటనలు అనేకం ఉన్నాయి. తప్పుడు పత్రాలతో ఇతరులను నమ్మించి, వారిని మోసం చేయడం లేదా డబ్బులు దండుకోవడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని ఇప్పుడు సెకన్లలో నకిలీ పత్రాలు తయారవుతున్నాయి. గతంతో పోలిస్తే సులభంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయగలుగుతున్నారు కేటుగాళ్లు.
ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో చూసిన ఫొటోలు, డాక్యుమెంట్లు సరైనవో కావో అనే విషయాన్ని పలుమార్లు చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఏఐ కంటెంట్ విచ్చలవిడిగా వ్యాప్తిలో ఉన్నందున సొంతంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని అంటున్నారు.
దీంతో పాటు ఆన్లైన్ మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
Also Read: