ఆధార్- పాన్ లింక్​కు లాస్ట్ ఛాన్స్- కొత్త గడువు ఇదే!

aadhaar pan link last date

aadhaar pan link last date: ఆధార్ పాన్ కార్డు లింక్ చేశారా? లేదంటే మీ కార్డు కొద్ది రోజుల తర్వాత పని చేయడం ఆగిపోతుంది. త్వరపడండి. త్వరగా ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోండి. ఆధార్ పాన్ లింక్ కోసం ఏం చేయాలో ఇక్కడ చదివేయండి.

aadhaar pan link last date: ఆధార్ పాన్ లింక్ కోసం కేంద్రం కొత్త డెడ్​లైన్​లు ప్రకటిస్తూ వస్తోంది. గతేడాదే ఆధార్ పాన్ కార్డు లింక్​కు గడువు ముగిసిపోగా.. మళ్లీ గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త తేదీలను ప్రకటించింది.

గడువు ఇదే- aadhaar pan linking deadline extended

ఆధార్ కార్డులను పాన్​తో లింక్ చేసేందుకు 2025 డిసెంబర్ 31 వరకు గడువు (aadhaar pan linking deadline) విధించింది సీబీడీటీ. ఆధార్ ఎన్​రోల్​మెంట్ ఐడీతో పాన్ కార్డు అప్లై చేసిన వారు సైతం తమ అసలైన ఆధార్ నెంబర్​ను పాన్ కార్డుకు లింకు చేయాల్సి ఉంటుంది.

2025 డిసెంబర్ 31కి ముందే ఆధార్ పాన్ కార్డు లింకు పూర్తి చేయాలని సీబీడీటీ తన నోటిఫికేషన్​లో సూచించింది. 2024 అక్టోబర్ ఒకటికి ముందు ఆధార్ ఎన్​రోల్​మెంట్ ఐడీతో పాన్ కార్డు పొందిన వారు సైతం ఈ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వీరంతా 2025 డిసెంబర్ 31 లోపు ఆదాయ పన్ను శాఖకు తమ ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలని తేల్చి చెప్పింది.

ఈ మేరకు ఏప్రిల్ 3న నోటిఫికేషన్ జారీ చేసింది సీబీడీటీ. 2024 అక్టోబర్ ఒకటికి ముందు పాన్ కార్డు తీసుకున్నవారికి ఇది వర్తించనున్నట్లు తెలిపింది.

పాన్- ఆధార్ కార్డు లింకింగ్ చేయడం ఎలా?– aadhaar pan link update

  • ఆదాయ పన్ను శాఖ వెబ్​సైట్ ద్వారా ఆధార్- పాన్ కార్డ్ లింక్ చేయాల్సి ఉంటుంది.
  • ట్యాక్స్ డిపార్ట్​మెంట్​కు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్​లోకి వెళ్లాలి.
  • అక్కడ కనిపించే పాన్- ఆధార్ లింకింగ్ ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • సంబంధిత వివరాలు సమర్పించి ప్రాసెస్ పూర్తి చేయాలి.

దీనికి పెనాల్టీ ఫీ ఏమైనా చెల్లించాలా లేదా అనే విషయంపై ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై వివరణ ఇవ్వాలని నిపుణులు కేంద్రాన్ని కోరుతున్నారు. సమాచారం స్పష్టంగా ఇస్తే పన్ను చెల్లింపుదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

  • పాన్ సర్వీస్ సెంటర్ అయిన ఎన్ఎస్​డీఎల్ ఈ-గవ్ పోర్టల్ ద్వారా కూడా పాన్ ఆధార్ లింక్ చేయవచ్చు.
  • లేదా ఏదైనా సర్వీస్ సెంటర్​లో బయోమెట్రిక్ పద్ధతిలో పాన్- ఆధార్ కార్డు లింకు చేయాల్సి ఉంటుంది.
  • పాన్ కార్డులోని సమాచారం ఆధార్ కార్డులోని డేటాతో సరిపోలకుంటే బయోమెట్రిక్ తప్పనిసరి.

గతంలో పాన్ కార్డును ఆధార్​తో లింక్ చేసేందుకు 2023 జూన్ 30 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత లింక్ చేసుకోవాలంటే రూ.1000 ఆలస్య రుసుము కింద చెల్లించాల్సి వచ్చింది.

  • అయితే, కొంతమంది ఆధార్ కార్డుతో కాకుండా.. ఆధార్ ఎన్​రోల్​మెంట్ ఐడీతో పాన్ కార్డు తీసుకున్నారు.
  • వారికి అప్పటికి ఆధార్ నెంబర్ కేటాయింపు జరగలేదు. కాబట్టి, వారి పాన్ కార్డు ఆధార్​తో లింక్ కానట్లే లెక్క.
  • వీరిని దృష్టిలో పెట్టుకొని తాజా ప్రకటన చేసింది సీబీడీటీ. ఈ నేపథ్యంలోనే వీరికి పెనాల్టీ నుంచి ఉపశమనం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

లింక్ చేయకపోతే? – aadhaar pan linking date

ఎన్​రోల్​మెంట్ ఐడీతో పాన్ కార్డు పొందినవారు ఆధార్ నెంబర్​తో లింక్ చేయకపోతే ఏం జరుగుతుందనేది సీబీడీటీ తన ప్రకటనలో పేర్కొనలేదు.

  • అయితే, గతంలో మాదిరే వీరి పాన్ కార్డులను నిలిపివేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
  • 2026 జనవరి 1 నుంచి వీరి పాన్ కార్డులను తొలగించవచ్చని అంచనా వేస్తున్నారు.
  • లేదా, గడువు పెంచి ఆలస్య రుసుము వసూలు చేయవచ్చని అంటున్నారు.

Also Read:

చాట్​జీపీటీతో నకిలీ ఆధార్​- పేమెంట్ రిసీట్​ కూడా!

700+ మైలేజ్​తో హైడ్రోజన్ ఈవీ- హ్యుందాయ్ సంచలనం!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top