UPI లావాదేవీలపై 18% GST? నిజమేంటో తెలుసుకోండి!

gst upi payments

gst upi payments: ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రూ.2,000కు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్‌టీ (GST) విధించనుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

gst upi payments: వాట్సాప్, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్ వంటి అన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై ఈ వార్తలు వేగంగా వ్యాపించాయి. దీని వల్ల UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే వాస్తవం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం UPI చెల్లింపులపై GST లేదు- gst on upi payments

ఈ విషయాన్ని సమగ్రముగా పరిశీలిస్తే, వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తేలింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా అధికారిక ప్రకటన లేదా నోటిఫికేషన్ జారీ చేయలేదు.

మనం రోజూ చేసే UPI లావాదేవీలపై ఏ రకమైన GST కూడా విధించబడటం లేదు. డిజిటల్ చెల్లింపులు వినియోగదారులకు పూర్తిగా ఉచితం. మీరు వ్యక్తిగతంగా అయినా, వాణిజ్య నిమిత్తంగా అయినా డబ్బు బదిలీ చేస్తే దానికి ఏ విధమైన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ వార్త ఎక్కడనుండి వచ్చింది?- gst on upi payments above 2000

సెప్టెంబర్ 2024లో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత ఒక నివేదిక వెలువడింది. ఆ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షత వహించారు.

ఆ నివేదికలో రూ.2,000కుపైగా జరిగే UPI లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలకు జీఎస్టీ విధించే ప్రతిపాదనను చర్చించారని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిని జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీకి పరిశీలన కోసం అప్పగించారు. అందువల్ల ప్రస్తుతం దీనిపై ఎటువంటి స్పష్టత లేదు.

వాస్తవాలు ఇవే: – upi charges news

  • వినియోగదారులపై రూ.2,000 కంటే తక్కువ లేదా ఎక్కువ అయినా UPI లావాదేవీలపై ఏ జీఎస్టీ కూడా లేదు.
  • ఈ వార్తల్లో పేర్కొన్న 18% జీఎస్టీ సర్వీస్ ప్రొవైడర్లపై మాత్రమే వర్తించవచ్చు – అది కూడా సర్వీస్ ఛార్జీలపై మాత్రమే, డబ్బు పంపించడంపై కాదు.
  • Google Pay, PhonePe, Paytm వంటి పేమెంట్ యాగ్రిగేటర్లు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తే వాటిపై జీఎస్టీ విధించే ప్రతిపాదన మాత్రమే చర్చించబడింది.
  • ఇది తుది నిర్ణయం కాదు. ప్రస్తుతం అది పరిశీలనలో ఉంది.
  • ప్రస్తుతం RuPay క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే UPI చెల్లింపులపైనా MDR (Merchant Discount Rate) వర్తించదు.

MDR అంటే ఏమిటి?- gst upi payments 2025

MDR లేదా Merchant Discount Rate అనేది సర్వీస్ ప్రొవైడర్లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులపై వసూలు చేసే ఫీజు.

ఇది సాధారణంగా 0.5% నుండి 2% వరకు ఉండవచ్చు. అయితే UPI చెల్లింపులపై ప్రస్తుతం MDR వసూలు చేయటం లేదు.

సర్వీస్ ప్రొవైడర్ల నిర్వహణ ఖర్చుల కోసం UPI పై MDR విధించాలన్న చర్చలు గతంలో జరిగినప్పటికీ, ఇప్పటికీ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు.

ముగింపు:

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న “UPI పై 18% జీఎస్‌టీ” వార్తలు పూర్తిగా అసత్యం. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా చేసిన ఈ ప్రచారాన్ని నమ్మవద్దు.

ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. కాబట్టి మీరు Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా UPI లావాదేవీలు నిస్సంకోచంగా కొనసాగించవచ్చు.

Also Read:

పెళ్లికి ముందు నీతా అంబానీ ఏం చేసేవారో తెలుసా?- జీతం మరీ తక్కువ

‘అంబానీ ఇల్లూ వక్ఫ్ ప్రాపర్టీనే!’- అంటిలియాపై వివాదం ఏంటి?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top