Ambani Net Worth: దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అని అడిగితే.. అయిదో తరగతి పిల్లాడైనా సరే ఠక్కుమని సమాధానం చెబుతాడు.. ముకేశ్ అంబానీ అని! ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నులలో ఒకరిగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రసిద్ధి చెందారు ముకేశ్. 67 సంవత్సరాల వయస్సులోనూ తమ సంస్థ సంపదను రోజురోజుకూ పెంచుకుంటూ వెళ్తున్నారు.
Ambani Net Worth: ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఆయన సంపద $ 92.5 బిలియన్ల ( సుమారు రూ.7 లక్షల కోట్లు)కు పైగా ఉంటుందని అంచనా. ఆయనకు చెందిన ఆస్తులు, పెట్టుబడులు, వ్యాపార వ్యూహాలు వేటికవే ప్రత్యేకం.
ఆయన విలాసవంతమైన జీవనశైలి మరింత విశేషంగా ఉంటుంది. ఇవన్నీ ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ ఆర్టికల్‌లో ముకేశ్ అంబానీ సంపద, ఆస్తులు, ఆయన విలాసవంతమైన జీవనశైలి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.
అంటిలియా- ప్రపంచంలో రెండో ఖరీదైన నివాసం- ambani net worth antilia

ముఖేశ్ అంబానీ నివసించే ముంబయిలోని అంటిలియా. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసంగా పేర్కొంటారు. దీనికి విలువ సుమారు $ 2 బిలియన్( రూ.17,000 కోట్లు) వరకు ఉంటుందని అంచనా.
27 అంతస్తుల ఈ అద్భుతమైన కట్టడం వల్ల ముంబయి నగరానికే ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. ఈ ప్రాపర్టీని అమెరికాకు చెందిన ‘పెర్కిన్స్ & విల్’ సంస్థ డిజైన్ చేసింది. దీని నిర్మాణాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ‘లైటన్ హోల్డింగ్స్’ చేపట్టి పూర్తి చేసింది.

ఈ భవనం ప్రత్యేకతలు
- ముకేశ్ అంబానీ అంటిలియాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విలాసానికి పెట్టింది పేరుగా ఈ భవనం ఉంటుంది. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది.
- ఇందులో ఒక మినీ థియేటర్, యోగా స్టూడియో, హెల్త్ సెంటర్, బాబిలోన్ స్ఫూర్తితో హ్యాంగింగ్ గార్డెన్స్, మూడు హెలిప్యాడ్స్తో పాటు అత్యుత్తమ సదుపాయాలు ఉన్నాయి.
స్టోక్ పార్క్ (యూకే) ambani net worth stoke park uk
Stoke Park Ambani: 2021లో ముకేశ్ అంబానీ స్టోక్ పార్క్ అనే ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇది యూకేలోని బకింగ్మ్షైర్లోని 900 సంవత్సరాల ప్రాచీనమైన కంట్రీ క్లబ్. 49 బెడ్రూమ్లు, 27 హోల్ గోల్ఫ్ కోర్సు, 13 టెన్నిస్ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్ తోటలు ఉన్న ఈ ఆస్తి విలువ సుమారు 590 కోట్ల రూపాయలు.

ఈ ప్రాపర్టీలో ఎన్నో చిత్రాలను ప్రదర్శించారు. 1964లో “గోల్డ్ ఫింగర్”, 1997లో “టుమారో నెవర్ డైస్” వంటి జేమ్స్ బాండ్ చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఆకర్షణీయమైన ఆస్తి కొనుగోలు చేయడం ద్వారా అంబానీ తన అంతర్జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించారు.


మాండరిన్ ఒరియెంటల్ హోటల్ (న్యూయార్క్)
2019లో ముకేశ్ అంబానీ న్యూయార్క్‌లోని ప్రముఖ మాండరిన్ ఒరియెంటల్ హోటల్‌ను కొనుగోలు చేశారు. ఈ హోటల్ కొనుగోలు కోసం మొత్తం $ 270 మిలియన్లు( రూ. 2,000 కోట్లు) వెచ్చించారు.

ఈ హోటల్‌ను సొంతం చేసుకునేందుకు ఎక్కడా వెనకాడలేదు ముకేశ్. ఆ హోటల్‌కు ఉన్న అప్పులను సైతం స్వీకరించారు. హోటల్‌లో లగ్జరీ సూట్లు, అద్భుతమైన డిజైనరీ రూమ్‌లు, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంబానీ విలాసవంతమైన జీవనశైలిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి.


దుబాయ్ బీచ్ ఫ్రంట్ విల్లా – ambani dubai house images
దుబాయ్‌లోని పామ్ జుమెరా ప్రాంతంలో ముకేశ్ అంబానీ 3,000 చదరపు అడుగుల బీచ్‌ఫ్రంట్ విల్లాను కొనుగోలు చేశారు.

ఈ విల్లాలో 10 బెడ్రూమ్లు, ప్రైవేట్ సెలూన్, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ స్పా వంటి అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి.
- అంతేకాకుండా, ఈ విల్లా ప్రత్యేకత ఏమిటంటే, ఇది 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్‌ను కలిగి ఉంది.
- ప్రైవసీకి ఏమాత్రం భంగం కలగకుండా ఉండేలా ఈ విల్లాను తీర్చిదిద్దారు.
- దీని సొంతం చేసుకోవడం ద్వారా అంబానీ కుటుంబం గోప్యత, విశ్రాంతి కోసం ఒక అద్భుతమైన ప్రదేశాన్ని పొందినట్లైంది.

ఖరీదైన విల్లా మరోసారి కొనుగోలు- ambani net worth dubai villa
2020లో ముకేశ్ అంబానీ దుబాయ్‌లో మరో భారీ ఆస్తిని కొనుగోలు చేశారు. మరో బీచ్ ఫ్రంట్ విల్లాను $ 163 మిలియన్ల( సుమారు రూ. 1,350 కోట్లు) ధరకు కొనుగోలు చేశారు. ఈ విల్లా పామ్ జుమెరాలోని కువైట్ వ్యాపారవేత్త మొహమ్మద్ అల్‌షాయా కుటుంబం నుంచి వచ్చింది.
ఈ విల్లా కూడా ప్రత్యేకమైన ఇంటీరియర్ ఉంది. విలాసవంతమైన డిజైన్, విశాలమైన లివింగ్ స్పేస్, ప్రైవేట్ బీచ్‌తో పాటు అదనపు సౌకర్యాలను అందిస్తుంది.
ముకేశ్ అంబానీ యొక్క ప్రపంచవ్యాప్త ఆస్తులు
ముకేశ్ అంబానీకి చెందిన ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ముంబయిలోని అంటిలియా, దుబాయ్‌లోని విల్లాలు, యూకేలోని స్టోక్ పార్క్, న్యూయార్క్‌లోని మాండరిన్ ఒరియెంటల్ హోటల్ ఇవన్నీ అంబానీ యొక్క విలాసవంతమైన జీవనశైలికి మరో నిదర్శనంగా నిలుస్తాయి.
అంబానీ మాత్రమే కాకుండా, ఆయన కుటుంబం కూడా ఈ విలాసవంతమైన ప్రాపర్టీలలో జీవిస్తూ వారి స్టైలిష్ జీవన విధానాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు.
- ఈ విధంగా, ముకేశ్ అంబానీ తన అనేక ఖరీదైన ఆస్తుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన జీవనశైలి చూపించారు.
- ఆయన అనేక పెట్టుబడులతో ప్రపంచ వ్యాప్తంగా తన స్థాయిని నిరూపించారు.
- బిలియనీర్ గా తనను గుర్తించేలా చేసిన ఆస్తులు, ప్రాజెక్టులు, పెట్టుబడులు అన్నింటినీ కలిపి ఆయనను ప్రపంచం అంతటా ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా నిలిపాయి.
Also Read: