jio new recharge plan రిలయన్స్ జియో వినియోగదారులకు షాక్. జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరిగాయి. ప్లాన్లపై రూ. 300 వరకు పెంచింది జియో. ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉండే ప్లాన్‌లకు పెంచిన ధరలు వర్తిస్తాయని ప్రకటించింది.
jio new recharge plan ఇదివరకు ఈ ఈ ప్లాన్‌ల ధరలు రూ. 1,099 మరియు రూ. 1,499 గా ఉండేవి. రూ. 1099 గా ఉన్న ప్లాన్ ధరను తాజాగా రూ. 1,299కు పెంచింది. అదే విధంగా రూ.1,499 గా ఉన్న ప్లాన్‌ను రూ.1,799కి పెంచింది.
అవే ప్రయోజనాలు
అయితే, ధరలు పెంచినప్పటికీ ప్లాన్‌ల ద్వారా అందే ప్రయోజనాలను మార్చలేదు జియో. ఈ రెండు ప్లాన్‌లకు ఉన్న ప్రయోజనాలు అదే విధంగా కొనసాగనున్నాయి.
ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ప్రీపెయిడ్ ప్లాన్లలో ప్రస్తుతం అతి చవకైనది రూ. 1,299 ప్లాన్. ఈ ప్లాన్ ప్రయోజనాల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
- రోజుకు 2GB డేటా
- రోజుకు 100 SMS
- జియో వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా 5G డేటా
రూ.1799 ప్లాన్ వివరాలు
రూ. 1,799 ప్యాక్ ప్రయోజనాల విషయంలో కాస్త మార్పులు చేసింది జియో. ఇదివరకు 2.5GB డేటా ఇస్తుండగా దీన్ని కాస్త పెంచింది. రోజుకు 3GB డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. ప్రయోజనాలు ఇవి…
- అపరిమిత కాల్స్
- రోజుకు 100 SMSలు
- అపరిమిత 5G డేటా
- 84 రోజుల వ్యాలిడిటీ
కాగా, సాధారణ ప్లాన్లను సైతం జియో ఇటీవలే పెంచింది. ప్లాన్‌కు 50 రూపాయల వరకు పెంచింది. 5జీ సేవలు ప్రారంభించిన నేపథ్యంలో రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. అయితే, జియో సహా ఇతర టెలికాం సంస్థలు ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ప్రస్తుతం నెలకు రూ. 149గా ఉండేది. ఈ ప్లాన్‌తో యాడ్స్ లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, టీవీ షోలు వీక్షించవచ్చు. ఈ ధర రూ.199కి పెరిగింది.