iphone price in dubai vs india: టెక్ దిగ్గజం ఆపిల్, తన iPhone 16 లైనప్‌ను వచ్చే నెలలో విడుదల చేయబోతోంది. పలు నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 10న ఐఫోన్ 16 ప్రారంభోత్సవం జరగనుంది. ఆరోజే ఐఫోన్ కొత్త మోడళ్ల ధర వివరాలు అధికారికంగా బయటకు వస్తాయి. అయితే, చారిత్రాత్మకంగా దుబాయిలో ఐఫోన్లు భారతదేశం కంటే తక్కువ ధరలో లభిస్తుంటాయి.
iphone price in dubai vs india: దుబాయ్‌లో ధరలు ఎంతవరకు తక్కువగా ఉంటాయి? అనే విషయంపై క్లారిటీ కోసం గత మూడు ఐఫోన్ సిరీస్‌ల ధరల గురించి వివరాలు కింద ఇచ్చాం. ఐఫోన్ 13 నుంచి 15 వరకు వివిధ మోడళ్ల ధరలు ఇండియాలో, దుబాయ్‌లో ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ చూడొచ్చు. దుబాయ్ కరెన్సీ దుబాయి దిర్హామ్ (AED) కాగా, అక్కడి ధరలను మన సౌలభ్యం కోసం రూపాయల్లోకి కూడా మార్చాము. దుబాయ్ దిర్హమ్ భారతీయ రూపాయికి మార్పిడి రేటు 1 AED = రూ. 22.84 గా ఉంది.
భారత్, దుబాయిలలో ఆపిల్ ఐఫోన్ ధరలు (ఐఫోన్ 13 నుండి ఐఫోన్ 15 వరకు)
- ఐఫోన్ 13: భారత్ ₹79,900, దుబాయి AED 3,399 (₹77,767.84)
- ఐఫోన్ 13 ప్రో: భారత్ ₹1,19,900, దుబాయి AED 4,199 (₹95,735.84)
- ఐఫోన్ 13 ప్రో మాక్స్: భారత్ ₹1,29,900, దుబాయి AED 4,699 (₹107,223.84)
- ఐఫోన్ 14: భారత్ ₹79,900, దుబాయి AED 3,399 (₹77,767.84)
- ఐఫోన్ 14 ప్లస్: భారత్ ₹89,900, దుబాయి AED 3,799 (₹86,783.84)
- ఐఫోన్ 14 ప్రో: భారత్ ₹1,29,900, దుబాయి AED 4,299 (₹98,355.84)
- ఐఫోన్ 14 ప్రో మాక్స్: భారత్ ₹1,39,900, దుబాయి AED 4,699 (₹107,223.84)
- ఐఫోన్ 15: భారత్ ₹79,990, దుబాయి AED 3,399 (₹77,767.84)
- ఐఫోన్ 15 ప్లస్: భారత్ ₹89,900, దుబాయి AED 3,799 (₹86,783.84)
- ఐఫోన్ 15 ప్రో: భారత్ ₹1,34,900, దుబాయి AED 4,299 (₹98,355.84)
- ఐఫోన్ 15 ప్రో మాక్స్: భారత్ ₹1,59,900, దుబాయి AED 5,099 (₹116,743.84)
(1 AED = ₹22.84)
అయితే, పైన పేర్కొన్న ధరలు ఆయా మోడళ్లు ప్రారంభించిన సమయంలోనివి. ప్రస్తుతం ఈ మోడళ్లు ఇంకా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 15 మోడళ్లకు ధర తేడా తక్కువగా ఉన్నప్పటికీ, ప్రో మోడళ్లకు తేడా గణనీయంగా ఉంది. ఉదాహరణకు, iPhone 15 Pro, దుబాయిలో భారతదేశం కంటే సుమారు ₹36,545 తక్కువగా ఉంది. అదేవిధంగా, iPhone 15 Pro Max దుబాయిలో సుమారు ₹43,156 తక్కువగా ఉంది. ధరల్లో ఇంత తేడా ఉంది కాబట్టి ఐఫోన్ ప్రో, ప్రో మాక్స్ మోడళ్లు కొనేవాళ్లకి ఇండియాలో కొనడం కంటే దుబాయ్‌కి వెళ్లి కొనడమే మేలు. ఫ్లైట్ టికెట్లు అయిన ఖర్చు కంటే రెట్టింపు ఆదా చేసుకోవచ్చు.
Also Read: రూ.25 వేలలో బెస్ట్ గేమింగ్ ఫోన్లు