whatsapp music update : మ్యూజిక్ లవర్స్ కోసం వాట్సాప్ మెస్మరైజ్ చేసే ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ స్టేటస్‌లకు మ్యూజిక్‌ను పోస్ట్ చేసుకునే విధంగా యాప్‌ను అప్డేట్ చేసింది. స్టేటస్‌లో మనం పెట్టుకునే ఫొటో, వీడియోలకు నచ్చిన పాటను యాడ్ చేసుకునేలా ఫీచర్ ( whatsapp music status updates ) అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టా తరహాలో ఈ వాట్సాప్ మ్యూజిక్ అప్డేట్ పని చేయనుంది.
whatsapp music update: వాట్సాప్ స్టేటస్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేయడం ఇలా..
- వాట్సాప్‌ను ఓపెన్ చేయండి.
- అప్డేట్స్ ట్యాబ్‌కు నావిగేట్ అవ్వండి.
- యాడ్ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
- మీరు స్టేటస్ పెట్టాలనుకుంటున్న ఫొటో లేదా వీడియోను ఎంపిక చేసుకోండి.
- స్టేటస్ ఎడిటింగ్ స్క్రీన్‌పై మీకు కొత్తగా వచ్చిన మ్యూజిక్ ఐకాన్ ( whatsapp music status ) కనిపిస్తుంది.
- పై భాగంలో ఈ ఐకాన్ ఉంటుంది.
- దానిపై ట్యాప్ చేసి సాంగ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- సెలెక్ట్ చేసుకున్న ట్రాక్ పక్కనే ఉన్న ఏరోపై క్లిక్ చేయాలి.
- సాంగ్‌లో నచ్చిన భాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
- తర్వాత డన్పై క్లిక్ చేయాలి.
- చివరగా సెండ్ బటన్‌పై ట్యాప్ చేస్తే స్టేటస్ అప్లోడ్ అవుతుంది.
60 సెకన్ల వరకు… whatsapp music status feature
స్టేటస్‌లో ఫొటో అప్లోడ్ చేస్తే 15 సెకన్ల వరకు సాంగ్‌ను ( whatsapp music status feature ) యాడ్ చేసుకోవచ్చు వాట్సాప్ యూజర్లు. వీడియోకు అయితే 60 సెకన్ల వరకు మ్యూజిక్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ మ్యూజిక్, సాంగ్స్ వాట్సాప్‌లోనే ఉంటాయని గమనించాలి. తమ లైబ్రరీలో లక్షలాది మ్యూజిక్ ట్రాక్స్, సాంగ్స్ ఉన్నాయని వాట్సాప్ వెల్లడించింది.
అయితే, ఈ ఫీచర్ టెక్ట్స్, జిఫ్, వాయిస్ స్టేటస్‌లకు అందుబాటులో లేదు. కేవలం ఫొటోలు, వీడియో అప్డేట్లకు మాత్రమే సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే, ఈ అప్డేట్ దశలవారీగా అమలు చేస్తోంది. ఈ అప్డేట్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు క్రమంగా అందుబాటులోకి తెస్తోంది వాట్సాప్.
భారత్‌లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఇప్పటికే కొంతమంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వచ్చే కొన్ని వారాల్లో ఈ అప్డేట్ అందరికీ అందుబాటులోకి రానుంది.
‘కొన్ని దేశాల్లో మ్యూజిక్ ఆన్ స్టేటస్ అప్డేట్ అందుబాటులో లేదు. ఇందులో బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మేం కష్టపడి పని చేస్తున్నాం’ అని వాట్సాప్ తన వెబ్సైట్లో పేర్కొంది.
వాట్సాప్‌కు సంబంధించి ఇతర అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
- ఐఓఎస్ యూజర్ల కోసం ఇటీవల వాట్సాప్ సరికొత్త అప్డేట్ను ప్రకటించింది.
- ఐఫోన్లలో కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్‌లు చేసుకోవడానికి డీఫాల్ట్ యాప్‌గా వాట్సాప్‌ను సెట్ చేసుకునే వీలు కల్పించింది.
- ఈ ఆప్షన్ ద్వారా యూజర్లు ఏదైనా కాంటాక్ట్‌పై క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా వాట్సాప్ నుంచి కాల్ వెళ్లిపోతుంది.
- కాంటాక్ట్‌లో మెసేజ్ ఐకాన్‌పై క్లిక్ చేయగానే.. వాట్సాప్ మెసేజ్‌లోకి రీడైరెక్ట్ అయిపోతుంది.
- ఇన్‌బిల్ట్ కాల్, మెసేజ్ యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది.
- అయితే, ఐఓఎస్ వెర్షన్ 18.2, ఆ పై వెర్షన్స్ వాడుతున్న యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
Also Read: