google year in search 2024: గూగుల్ 2024 ఇయర్ ఇన్ సెర్చ్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారతీయులు ఈ ఏడాది అత్యధికంగా చేసిన శోధనల వివరాలను పొందుపరిచింది. వినోదం, క్రీడలు, ప్రస్తుతం జరిగిన సంఘటనలు మరియు రోజువారీ ప్రశ్నల వరకు, భారతీయుల ఆసక్తులను ఈ నివేదిక ప్రతిబింబిస్తోంది.
google year in search 2024: గూగుల్ ప్రతి సంవత్సరం ఈ నివేదికను విడుదల చేస్తూ, కలకాలం ప్రజల మనసులను ఆకట్టుకున్న క్షణాలు, ధోరణులను అందులో చేర్పుతుంది. ఈ సంవత్సరం భారతీయులు రోజుకు కోట్ల సంఖ్యలో శోధనలు చేయగా, వాటిలో 15% కొత్తగా ఉండటం విశేషం.
2024లో భారతీయుల శోధనలు విభిన్న విషయాలపై ఆసక్తిని చూపించాయి. ఐపీఎల్ నుంచి ఒలింపిక్స్ వరకు క్రీడలపై మక్కువ, స్ట్రీ 2 వంటి సినిమాలు మరియు కె-డ్రామాల ద్వారా వినోదం పట్ల ప్రేమను చూపించాయి. అదే విధంగా, నాదానియాన్ వంటి ఇండీ మ్యూజిక్ హిట్స్‌ను ఆస్వాదిస్తూ, వినేష్ ఫోగట్, హార్దిక్ పాండ్యా వంటి క్రీడాకారులను ఘనంగా గుర్తించి, మరణించిన రతన్ టాటాకు నివాళులు అర్పించారు. ప్రయాణానికి సంబంధించి, ఈ ఏడాది భారతీయుల చిరకాల కలల గమ్యం ఆజర్బైజాన్‌గా నిలిచింది. అలాగే, “ఎలా ఓటు వేయాలి?” లేదా “నా సమీపంలోని AQI” వంటి ఆచరణాత్మక ప్రశ్నలు కూడా శోధించబడినాయి.
గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024: మొత్తం శోధనల్లో అగ్రస్థానంలో ఉన్నవి
- ఇండియన్ ప్రీమియర్ లీగ్
- టీ20 వరల్డ్ కప్
- భారతీయ జనతా పార్టీ
- 2024 ఎన్నికల ఫలితాలు
- ఒలింపిక్స్ 2024
- అధిక ఉష్ణోగ్రతలు
- రతన్ టాటా
- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- ప్రో కబడ్డీ లీగ్
- ఇండియన్ సూపర్ లీగ్
సినిమాల్లో శోధనలో ముందు ఉన్నవి– google year in search movies
- స్ట్రీ 2
- కల్కి 2898 AD
- 12వ ఫెయిల్
- లాపటా లేడీస్
- హనూ-మాన్
- మహారాజా
- మంజుమ్మెల్ బాయ్స్
- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
- సలార్
- ఆవేశం
షోల్లో అగ్రగాములు– google year in search 2024 movies
- హీరామండీ
- మిర్జాపూర్
- లాస్ట్ ఆఫ్ అస్
- బిగ్ బాస్ 17
- పంచాయత్
- క్వీన్ ఆఫ్ టియర్స్
- మేరీ మై హస్బండ్
- కోటా ఫ్యాక్టరీ
- బిగ్ బాస్ 18
- 3 బాడీ ప్రాబ్లమ్
వినోదం, సంగీతం విభాగంలో శోధనలు– google year in search music
- నాదానియాన్
- హసన్
- ఇల్యూమినాటి
- కచ్చి సెరా
- యే తునే క్యా కియా
- ఆజ్ కీ రాత్
- జో తుమ్ మేరే హో
- యే రాతేన్ యే
- మౌసమ్
- ఆశా కూడా
“నియర్ మీ” శోధనలు– google year in search 2024 nearme
- AQI నీర్ మీ
- ఒణం సద్య నీర్ మీ
- రామ్ మందిర్ నీర్ మీ
- స్పోర్ట్స్ బార్స్ నీర్ మీ
- బెస్ట్ బేకరీ నీర్ మీ
- ట్రెండీ కాఫీలు నీర్ మీ
- పోలియో డ్రాప్స్ నీర్ మీ
- శివ మందిర్ నీర్ మీ
- బెస్ట్ కాఫీ నీర్ మీ
- హనుమాన్ మూవీ నీర్ మీ
వ్యక్తుల గురించి శోధనలు– google year in search 2024 persons
- వినేష్ ఫోగట్
- నితీష్ కుమార్
- చిరాగ్ పాస్వాన్
- హార్దిక్ పాండ్యా
- పవన్ కళ్యాణ్
- శశాంక్ సింగ్
- పూనమ్ పాండే
- రాధికా మర్చెంట్
- అభిషేక్ శర్మ
- లక్ష్య సేన్
క్రీడా ఈవెంట్లలో అగ్రస్థానంలో ఉన్నవి– google year in search 2024 sports
- ఇండియన్ ప్రీమియర్ లీగ్
- టీ20 వరల్డ్ కప్
- ఒలింపిక్స్
- ప్రో కబడ్డీ లీగ్
- ఇండియన్ సూపర్ లీగ్
- మహిళల ప్రీమియర్ లీగ్
- కోపా అమెరికా
- దులీప్ ట్రోఫీ
- యూరో 2024
- అండర్-19 వరల్డ్ కప్
ప్రయాణ గమ్యాలు
- ఆజర్బైజాన్
- బాలి
- మనాలి
- కజకస్తాన్
- జైపూర్
- జార్జియా
- మలేషియా
- అయోధ్య
- కాశ్మీర్
- సౌత్ గోవా
ఈ నివేదిక ద్వారా భారతీయుల ఆసక్తులను గూగుల్ స్ఫూర్తిగా తెలియజేస్తూ, వారి వెతుకులాట ప్రయాణాన్ని విశ్లేషించింది.
Also Read: రాయల్ ఎన్‍ఫీల్డ్ ‘ఈ-బైక్’ ఎలా ఉందో తెలుసా?