CMF Phone 2 Pro: CMF by Nothing తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ CMF Phone 2 Proను ఏప్రిల్ 28, 2025న లాంచ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్, కెమెరా, ప్రాసెసర్ వంటి కీలక ఫీచర్లను కంపెనీ సోషల్ మీడియా ద్వారా టీజర్ రూపంలో వెల్లడించింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లు ఉండటంతో, ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో యూత్‌కి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
మోడర్న్ లుక్‌తో మాస్ అప్పీల్- CMF Phone 2 Pro design
CMF Phone 2 Pro వెనుక భాగం హార్డ్ ప్లాస్టిక్‌తో డిజైన్ చేశారు. దానిపై స్క్రూల్‌తో ఫిట్ చేసిన డ్యూయల్-టోన్ ఫినిష్ ఉంటుంది. ఫోన్ Orange, Grey కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ఫోన్ డిజైన్ సింపుల్‌గా ఉండటంతోపాటు, కాస్త డిఫరెంట్ లుక్ ఇస్తుంది.
కెమెరా సెట్‌అప్- CMF Phone 2 Pro camera specifications
ఈ ఫోన్‌లో 50MP మెయిన్ సెన్సార్ (1/1.57 అంగుళాలు), 50MP టెలిఫోటో కెమెరా (2x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రావైడ్ కెమెరా (119.5 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ) ఉన్నాయి.
ఈ మూడు కలిపి ప్రీమియం కెమెరా అనుభవాన్ని అందిస్తాయి. గత ఏడాది వచ్చిన CMF Phone 1లో కేవలం డ్యూయల్ కెమెరా మాత్రమే ఉండగా, ఈసారి మూడో కెమెరా ద్వారా మరింత వర్సటాలిటీ రానుంది.
ప్రాసెసింగ్ పవర్: Dimensity 7300 Pro SoC
ఈ ఫోన్‌లో ఉన్న MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ గత తరం మోడల్‌తో పోలిస్తే 10% వేగంగా పని చేస్తుంది.
- GPU పనితీరులో 5% ఇంప్రూవ్ ఉంది.
- అదనంగా, ఇది 6వ తరం AI యూనిట్‌తో వస్తుంది.
- 4.8 TOPS సామర్థ్యం కలిగి ఉంటుంది.
- అంటే, ఇది గేమింగ్, వీడియో ఎడిటింగ్, ఫోటో ప్రాసెసింగ్ వంటి టాస్క్ లలో స్మూత్ పనితీరును అందిస్తుంది.
గేమింగ్ అనుభవం: cmf phone 2 price
- CMF Phone 2 Proలో గేమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫీచర్లు ఉన్నాయి.
- BGMI వంటి గేమ్స్‌ను 120FPS రేట్‌తో ఆడవచ్చు.
- 1000Hz టచ్ సెంప్లింగ్‌తో స్క్రీన్ రెస్పాన్స్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది.
- అంతేకాదు, నెట్‌వర్క్ బూస్ట్ 53% ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
- దీని వలన ఆన్‌లైన్ గేమ్స్, వీడియో కాల్స్ చాలా క్లియర్‌గా, ల్యాగ్ లేకుండా జరుగుతాయి.
చార్జర్ + ట్రాన్స్‌పరెంట్ కవర్
ఫోన్ బాక్స్‌లో చార్జర్‌తో పాటు ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ కవర్ కూడా లభిస్తుంది.
ఇప్పుడు చాలా కంపెనీలు బాక్స్‌లో చార్జర్ ఇవ్వడం మానేసిన నేపథ్యంలో, CMF వినియోగదారులకు బోనస్ కలిగించేలా ఈ నిర్ణయం తీసుకుంది.
అదనపు లాంచ్‌లు: Buds 2 సిరీస్ కూడా వస్తుంది
CMF Phone 2 Proతో పాటు, సంస్థ నుంచి Buds 2, Buds 2a, మరియు Buds 2 Plus పేరుతో మూడు కొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్లు కూడా రానున్నాయి. ఇవి ఫోన్‌తో కలిపి ఒక పూర్తిస్థాయి డివైస్ ఎకోసిస్టమ్‌ను తయారు చేస్తాయి.
క్లాస్ & కలర్ కలిపిన క్లియర్ ఛాయిస్
ఫోన్ డిజైన్, కెమెరా, ప్రాసెసర్, గేమింగ్ ఫీచర్లు అన్ని పరంగా CMF Phone 2 Pro బడ్జెట్ సెగ్మెంట్‌లో ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది.
ఫోన్ ధర ఇంకా అధికారికంగా బయటపెట్టకపోయినా, ఇందులోని ఫీచర్లను బట్టి ఇది ధరకు తగినదిగా కాకుండా దానికంటే ఎక్కువ విలువను కలిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఏప్రిల్ 28న జరిగే లాంచ్ ఈవెంట్ తర్వాత పూర్తి సమాచారం, ఆఫర్లు, కొనుగోలు తేదీలు వెల్లడవుతాయి. ప్రీమియం అనుభవాన్ని అఫార్డబుల్ ధరలో అందుకునే వారి కోసం ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది.
Also Read: