calling blocked number: మీ ప్రేయసి/ప్రేమికుడు మిమ్మల్ని బ్లాక్ చేశారా? కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలా ఏ ప్లాట్‌ఫామ్ నుంచి కాంటాక్ట్ అవ్వాలని ప్రయత్నించినా మీకు నిరాశే ఎదురవుతోందా? అన్ని రకాలుగా ప్రయత్నించి అలసిపోయి గుండె బరువెక్కుతోందా? అయితే, అలసిన మీ మనసుకు కాస్త ఉపశమనం ఇవ్వబోతున్నాం. మిమ్మల్ని బ్లాక్ చేసిన వారి ఫోన్‌కు ఈజీగా కాల్ చేసే అవకాశం గురించి మీకు తెలియజేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. లెట్స్ జంప్ ఇంటు ది స్టోరీ!
calling blocked number: మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి మీరు ఈజీగా కాల్ చేయొచ్చు. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మీ ఫోన్లోని సెట్టింగ్స్ మార్చుకోవడం నుంచి, థర్డ్ పార్టీ యాప్స్ వరకు వివిధ మార్గాల్లో మీరు మీ సొంతవారికి కాల్స్ చేయొచ్చు.
కాలర్ ఐడీ కనిపించకుండా చేయడం- Hide Caller ID to call Blocked number
కాల్ డయల్ చేసే ముందు మీ కాలర్ ఐడీని కనిపించకుండా చేయడం ద్వారా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు కాల్ చేయవచ్చు. సింపుల్‌గా కింది స్టెప్స్‌ను ఫాలో అయ్యి కాలర్ ఐడీని హైడ్ చేయండి.
- డయలర్ యాప్ ఓపెన్ చేయండి.
- టాప్ రైట్ కార్నర్లో ఉన్న త్రీ-డాట్స్‌పై క్లిక్ చేయండి.
- సెట్టింగ్స్‌ను సెలెక్ట్ చేయండి.
- కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు సప్లిమెంటరీ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి.
- అందులో షో యువర్ కాలర్ ఐడీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ నెవర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఇలా మీరు మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి కాల్ చేసే ఛాన్స్ ఉంది. ఇది కొన్ని ఫోన్లలో పని చేయకపోవచ్చు.
రెండో ఫోన్ నెంబర్‌తో కాల్ చేయండి- How to call blocked number
మీకు గనక రెండు సిమ్‌లు ఉంటే, రెండో నెంబర్‌తో మీవారికి కాల్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైమరీ నెంబర్‌ను బ్లాక్ చేస్తే, సెకండరీ నెంబర్‌తో ట్రై చేసి చూడండి. లేదా కొత్త సిమ్ తీసుకోండి. కొత్త సిమ్‌తో కాల్ చేయడానికి ప్రయత్నించండి.
వర్చువల్ నెంబర్ తీసుకోండి- Virtual Number for calling
మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి మీ రెండో నంబర్‌ను కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. కొత్త సిమ్ తీసుకున్నా.. ఆ నంబర్‌ను బ్లాక్ చేయడం కూడా పెద్ద విషయమేమీ కాదు. అప్పుడు మీ శ్రమ అంతా వృథా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్చువల్ నెంబర్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్.
ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసులు చాలానే ఉన్నాయి. అందులో రిజిస్టర్ అయితే మీకు ఒక కొత్త నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. సందేశాలు కూడా పంపించుకోవచ్చు. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్‌లో కూడా రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది.
వాట్సాప్ లేదా మెసేంజర్ ద్వారా కాల్ చేయండి
సెల్యులార్ నెట్‌వర్క్‌పై మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే ఆన్లైన్ యాప్స్ ద్వారా వారికి కాల్ చేయడానికి ప్రయత్నించండి.
ఫేస్బుక్ మెసేంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్‌లో మిమ్మల్ని బ్లాక్ చేయకపోతే, ఆయా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కాంటాక్ట్ అయ్యే వీలు ఉంటుంది.
గూగుల్ మీట్ ప్రయత్నించండి
మీ నెంబర్ బ్లాక్‌లో ఉన్నప్పటికీ గూగుల్ మీట్ ద్వారా మీరు వీడియో లేదా ఆడియో కాల్స్ చేసుకునే వీలు ఉంటుంది. సాధారణంగా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తులు సెల్యులార్ నెట్వర్క్ ద్వారా వచ్చే కాల్స్‌నే బ్లాక్ చేస్తారు.
ఇన్-బిల్ట్‌గా ఉండే గూగుల్ మీట్ వంటి యాప్స్‌లో బ్లాక్ చేసే ఛాన్స్‌లు చాలా తక్కువ.
కాబట్టి, గూగుల్ మీట్ ద్వారా కాల్ చేయడానికి ప్రయత్నిస్తే, వారితో మీరు కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ట్రూకాలర్ వాయిస్
గూగుల్ మీట్ తరహాలోనే ప్రత్యేకంగా బ్లాక్ చేస్తే తప్ప ట్రూకాలర్ వాయిస్ నుంచి మీరు కాల్స్ చేసుకునే వీలు ఉంటుంది.
ట్రూకాలర్ ఓపెన్ చేసి, సంబంధిత కాంటాక్ట్ తెరవండి. అక్కడ నార్మల్ కాల్ ఆప్షన్ పక్కనే ట్రూకాలర్ వాయిస్ కాల్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు సంబంధిత వ్యక్తికి కాల్ చేసుకోవచ్చు.
చివరి బ్రహ్మాస్త్రం
పైన పేర్కొన్న ఆప్షన్స్ ఏవీ పని చేయకపోయినా.. నిరాశపడొద్దు. మీకు కావాల్సిన వారికి కాల్ చేసే అవకాశం ఇంకా ఉంది. ఎన్ని ప్లాట్‌ఫామ్‌లలో మిమ్మల్ని వారు బ్లాక్ చేసినా.. మీరు చాలా ఈజీగా వారికి కాల్ చేయొచ్చు.
- Hangout Voice వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీరు మీకు నచ్చిన నెంబర్‌కు కాల్ చేయవచ్చు.
- ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, కొన్ని డబ్బులు చెల్లించి మీరు క్రెడిట్స్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత మీకు నచ్చిన నెంబర్‌కు కాల్ చేసి మాట్లాడొచ్చు.
- అయితే, అవతలి వ్యక్తికి ఏదో ఒక రాండమ్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్లు కనిపిస్తుంది.
- కొన్నిసార్లు విదేశీ నెంబర్లు సైతం చూపిస్తుంది.
- అలా కాకుండా, మీ సొంత నెంబర్ కనిపించేలా చేయాలనుకుంటే, ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
- అయితే, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మా టీమ్ ప్రయత్నించినప్పుడు కొన్ని నెట్‌వర్క్‌లపై పని చేయడం లేదని తెలిసింది.
అతి వద్దు- చట్టం అతిక్రమించొద్దు
అతి ఎప్పుడైనా చేటే చేస్తుంది. కాబట్టి ఎదుటివారికి కాల్స్ చేసే ముందు మీ పరిధిలో ఉండటం మంచిది. అవతలి వ్యక్తిని హరాస్ చేసే రేంజ్లో మీరు కాల్స్ చేస్తే చట్టం మీ పని పట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, పరిమితంగా, మీ ప్రయత్నాలను తెలపడానికి మాత్రమే పై ఆప్షన్స్‌ను ఉపయోగించుకోండి. అంతేకానీ, పదేపదే డిస్టర్బ్ చేయడానికి, మానసికంగా హింసించడానికి ఉపయోగించొద్దని కఠినమైన సలహా ఇస్తున్నాం.
Also Read: ఇన్‌స్టా స్టోరీలను సీక్రెట్‌గా చూడటం ఎలా?