tata sierra ev- ఈవీ ప్రియులను ఆకట్టుకునేందుకు టాటా మోటార్స్ సరికొత్త కారును ఆవిష్కరించింది. తన అధునాతన మోడల్ ‘టాటా సియెర్రా ఈవీ ఎస్యూవీ’ని పరిచయం చేసింది. 2024 ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించింది. ఈ మోడల్ ఉత్పత్తిని త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఈ కారు అందుబాటులో ఉండనుంది.
tata sierra ev launch date
2025 ద్వితీయార్ధంలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టాటా కంపెనీ వెల్లడించింది. వీలైతే దీపావళికి టాటా సియెర్రా విక్రయాలు ప్రారంభించనున్నట్లు సమాచారం.
tata sierra ev price – టాటా సియెర్రా ఈవీ ధర
అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్‌ను సిద్ధం చేసింది టాటా. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ)తో కూడిన టాటా సియెర్రా ధర సుమారుగా రూ.10.50 లక్షల నుంచి ప్రారంభం నుంది. బేస్ ధర రూ.10.50గా ఉండనుంది.
ఎలక్ట్రిక్ వెర్షన్ ధర మాత్రం అధికంగా ఉండనుంది. బేస్ మోడల్ ఎలక్ట్రిక్ టాటా సియెర్రా ఈవీ ధర రూ.25 లక్షల వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది. మిడ్ సైజ్ ఎస్యూవీ మార్కెట్లో ఈ మోడల్ ఆకట్టుకునే ఛాన్స్ ఉంది.
టాటా సియెర్రా ఫీచర్లు
కారు స్పెసిఫికేషన్స్ విషయంపై పూర్తి సమాచారం లేదు. అయినప్పటికీ కారు ఫీచర్లపై ఇండస్ట్రీ వర్గాలు కొన్ని అంచనాలు వేశాయి. టాటా సియెర్రా ఐసీఈ మోడల్.. రెండు వేర్వేరు ఇంజిన్లతో అందుబాటులో ఉండనుంది.
- 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మొదటిది. ఇది 170పీఎస్ పవర్, 280ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్.. దాదాపు 118పీఎస్ పవర్, 260ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని సమాచారం.
- 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్‌తో టాటా సియెర్రా రానుంది. 7 స్పీడ్ డీసీటీ ఆటోమెటిక్ వెర్షన్ సైతం ఉండనుంది.
tata sierra ev range – టాటా సియెర్రా ఈవీ మైలేజీ
మార్కెట్ వర్గాల అభిప్రాయం ప్రకారం టాటా సియెర్రాలో 60 కిలో వాట్ బ్యాటరీ ఉండనుంది. డ్యూయల్ మోటార్ ఏడబ్ల్యూడీ సెటప్ కలిగి ఉండనుంది. ఈ పవర్ఫుల్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌తో 500 కిలో మీటర్ల (tata sierra ev mileage) వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణం చేయవచ్చు. తక్కువ బడ్జెట్లో కావాలంటే లోయర్ ట్రిమ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
సియెర్రా పెట్రోల్, డీజిల్ వెర్షన్ బాడీకి 4×4 డ్రైవ్‌ట్రైన్ ఫీచర్‌ను జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ రోడ్లో కారు సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మూడు స్క్రీన్లు
టాటా సియెర్రా ఈవీలో హైటెక్ ఫీచర్లు ఉండనున్నాయి. యాక్టి.ఈవీ ప్లాట్‌ఫామ్‌పై సియోర్రా ఈవీని అభివృద్ధి చేస్తోంది టాటా. సియెర్రా ఈవీ వేరియంట్లో మూడు స్క్రీన్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. అవి..
- సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్
- ప్యాసింజర్ సైడ్ డిస్ప్లే
- డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్
- అదనపు ప్రీమియం ఫీచర్లు
- పానోరామిక్ సన్‌రూఫ్
- వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో
- యాపిల్ కార్ప్లే
- వెంటిలేటెడ్ సీట్లు
- ఆటో-డిమ్మింగ్
- 360 డిగ్రీల కెమెరా
- లెవెల్-2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్)
మార్కెట్ షేక్!
పవర్ఫుల్ ఇంజిన్లు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, సరసమైన ధరలు వంటి ఫీచర్లతో టాటా సియెర్రా ఎస్యూవీ.. మార్కెట్లో సంచలనం సృష్టించే అవకాశం లేకపోలేదు. ఇండియన్ యూజర్లకు సరిపోయే విధంగా ఈ కారును మలిచేందుకు టాటా అన్ని కసరత్తులు చేస్తోంది. 2025 దీపావళి నాటికి ఈ కారు రిలీజ్ అయ్యే అవకాశం ఉండనుంది. ఈ నేపథ్యంలో అప్పటికి ఈ కారుకు మరింత డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.
ఇవీ చదవండి