hyundai nexo hydrogen: ఈవీ రంగంలో సంచలనం సృష్టించే మోడల్‌ను ఆవిష్కరించింది హ్యుందాయ్. సెకండ్ జనరేషన్ నెక్సో హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ ఎస్‌యూవీని ( hyundai nexo hydrogen car ) సిద్ధం చేసింది. 2024 నాటి ఇనీషియం కాన్సెప్ట్ ఆధారంగా తాజా మోడల్‌ను తయారు చేసింది హ్యుందాయ్. ఈ హ్యుందాయ్ నెక్సోలో ఆర్ట్ ఆఫ్ స్టీల్ డిజైన్ ఉండటం గమనార్హం.
hyundai nexo hydrogen: గతేడాది హ్యుందాయ్ నెక్సో కాన్సెప్ట్ కారును విడుదల చేసింది ఆ సంస్థ. తాజాగా తయారు చేసిన హైడ్రోజన్ నెక్సో దాదాపు ఆ కాన్సెప్ట్ కారును పోలి ఉంది.

హ్యుందాయ్ నెక్సో ఫీచర్లు– hyundai nexo hydrogen electric car
- పవర్ ఔట్పుట్- 204 హార్స్ పవర్
- 350 ఎన్ఎం టార్క్
- 7.8 సెకన్లలో 0 నుంచి 100 kph వేగం అందుకుంటుంది
- 2.64 kWh బ్యాటరీ
- 80kW గరిష్ఠ ఔట్పుట్
ఈ కారులో 6.69 కేజీల భారీ హైడ్రోజన్ ట్యాంకు ఉంది. దీంతో ఈ కారు 700 కిలోమీటర్ల వరకు నిరంతరాయం నడవనుంది. హ్యుందాయ్ నెక్సోకు ఈ స్థాయి రేంజ్ ఉండటం మార్కెట్లో సంచలనంగా మారింది.
ఈ నెక్సోలో గ్రిడ్ ఆకారంలో ముందు, వెనుక లైట్లు అమర్చారు. బంపర్‌పై హెచ్ ఆకారంలో ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. బ్లాక్ ప్యానెళ్లకు బదులు సిల్వర్ రంగులో వీటిని రూపొందించారు.
హ్యుందాయ్ నెక్సోలో 18 అంగుళాల టైర్లను అమర్చారు. ఇవి ఏరో ఎఫీషియంట్ ఫీచర్‌తో రానున్నాయి. ఇతర హ్యుందాయ్ కార్లతో పోలిస్తే నెక్సోలో (hyundai nexo hydrogen fcev) భిన్నమైన రూఫ్‌లైన్ ఉంది. అడ్వాన్స్డ్ త్రీ-కోట్ పెయింట్‌ను ఈ కారు కోసం వినియోగించారు. చూసే కోణం బట్టి ఈ కారు రంగులు వేర్వేరుగా కనిపిస్తాయి.

మొత్తం ఆరు భిన్నమైన రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉండనుంది. నెక్సో గత మోడల్‌తో పోలిస్తే తాజా మోడల్ కాస్త ఎత్తుగా, పొడవుగా, వెడల్పుగా ఉంది.
హ్యుందాయ్ నెక్సో డైమెన్షన్స్ Hyundai Nexo dimensions
కారు | కొత్త హ్యుందాయ్ నెక్సో | పాత హ్యుందాయ్ నెక్సో |
పొడవు | 4750 | 4671 |
వెడల్పు | 1865 | 1859 |
ఎత్తు | 1673 | 1630 |
వీల్‌బేస్ | 2790 | 2790 |
హ్యుందాయ్ నెక్సో ఇంటీరియర్- Hyundai Nexo interior
ఐయానిక్ 5 ఈవీకి చెందిన 12.3 అంగుళాల డిస్ప్లేలను ఈ కారుకు అమర్చింది హ్యుందాయ్. డ్యాష్‌బోర్డుకు ఉండే ఈ స్క్రీన్‌పై కెమెరా ఫీడ్ సహా ఇతర ఆప్షన్లు ఉండనున్నాయి.
- యాపిల్ కార్ప్లే
- ఆండ్రాయిడ్ ఆటో
- ఓటీఏ అప్డేట్స్
- 14 స్పీకర్ బ్యాంగ్
- ఓలుఫ్సెన్ సౌండ్ సిస్టమ్
- వైర్లెస్ ఛార్జర్
- వీ2ఎల్ (వెహికిల్ టు లోడ్)
ఈ కొత్త ఎస్‌యూవీలో సీట్లను సన్నగా తయారు చేసినట్లు హ్యుందాయ్ (hyundai nexo hydrogen fcev) తెలిపింది. కారులో స్పేస్ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఎక్కువ కాలం మనుగడ సాధించే మెటీరియల్స్‌తో సీట్లను తయారు చేసినట్లు వెల్లడించింది. బయో ప్రాసెస్ లెదర్, రీసైకిల్ చేసిన పీఈటీ ఫ్యాబ్రిక్, లినెన్ ఫ్యాబ్రిక్స్‌ను క్యాబిన్ కోసం తయారు చేసినట్లు వివరించింది. (hyundai nexo hydrogen fcev)
హ్యుందాయ్ నెక్సో సేఫ్టీ ఫీచర్లు- hyundai nexo india
- ఏకంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లు
- ఏడీఏఎస్ టెక్నాలజీ
- 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ (యూరో ఎన్సీఏపీ)
- టాప్ సేఫ్టీ పిక్ అవార్డ్
ఇకపై వచ్చే కొత్త మోడళ్లన్నింటికీ టాప్ సేఫ్టీ ఫీచర్లను జోడించనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. బలమైన మెటీరియల్‌ను ఉపయోగించి కారు బాడీని తయారు చేయనున్నట్లు సమాచారం. మల్టీ స్కెలిటన్ ఆకారంలో నెక్సోను తయారు చేసినట్లు పేర్కొంది. ప్యాసింజర్లతో పాటు హైడ్రోజన్ ట్యాంకును సురక్షితంగా ఉంచేందుకు తొమ్మిది ఎయిర్ బ్యాగులను కారులో ఇన్స్టాల్ చేసినట్లు వివరించింది.
నెక్సో లాంఛ్ డేట్
2025లోనే హ్యుందాయ్ నెక్సో లాంఛ్ కానుందని తెలుస్తోంది. కచ్చితమైన డేట్ ఇంకా ఖరారు కాలేదు.
నెక్సోను 2020 ఆటో ఎక్స్పో, 2018 ఇండియా కొరియా బిజినెస్ సమ్మిట్లలో ప్రదర్శించింది హ్యుందాయ్.
అయితే, ఇండియాలో హైడ్రోజన్ పంపులు చాలా తక్కువగా ఉండటం వీటి అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసింది హ్యుందాయ్.
Also Read: