aadhaar free update: ప్రభుత్వం ప్రతి పౌరుడు 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ కార్డు సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గతంలో అప్డేట్ గడువును అనేకసార్లు పొడిగించినప్పటికీ, తదుపరి పొడిగింపు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
aadhaar free update: ఆధార్ అనేది 12 అంకెల గుర్తింపు సంఖ్య, ఇది ఆదాయ పన్ను ఫైల్ చేయడం, విద్యా ప్రవేశాలు, ప్రయాణం వంటి అనేక ముఖ్యమైన సేవల కోసం వినియోగిస్తారు.
తప్పనిసరిగా ఆధార్ వివరాలను సక్రమంగా అప్డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ సేవలను పొందడం సులభం అవుతుంది. అదే సమయంలో అనవసర మోసాలను కూడా నివారించవచ్చు.
ఆధార్ వివరాలను ఆన్‌లైన్ అప్డేట్- aadhaar details update free
UIDAI అధికారిక వెబ్‌సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లోకి వెళ్ళి ఆధార్ నంబర్, OTP ద్వారా లాగిన్ చేసి అవసరమైన వివరాలను సవరించుకోవచ్చు.
వివరాల మార్పు విధానం: free aadhaar update last date
- అధికారిక UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లండి (https://myaadhaar.uidai.gov.in/)
- మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్ చేయండి
- మీ ప్రొఫైల్‌లో ఉన్న చిరునామా మరియు ఇతర వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి
- అవసరమైతే, సంబంధిత డాక్యుమెంట్‌ను డ్రాప్‌డౌన్ మెనూ ద్వారా ఎంచుకోండి
- ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ కాపీని (JPEG, PNG లేదా PDF ఫార్మాట్, 2 MB కంటే తక్కువ) అప్‌లోడ్ చేయండి
- మీ అప్డేట్ అభ్యర్థనను సబ్మిట్ చేయండి
- మీ అప్డేట్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN)ను గమనించుకోండి
ఆ అప్డేట్లు ఉడాయ్ సెంటర్లోనే
ఇది ఆన్‌లైన్ ద్వారా చిరునామా మార్పు కోసం మాత్రమే. బయోమెట్రిక్ వివరాలు, ఫోటో, పేరు లేదా మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే, UIDAI అథారైజ్ చేసిన కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉచిత సర్వీసు సెప్టెంబర్ 14, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ అప్డేట్ కోసం రూ. 50 ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ప్రభుత్వ పథకాలు, గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డును విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మన ఆధార్ కార్డును ఇతరులు అనుచితంగా ఉపయోగిస్తున్నారో లేదో అని తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించామో చెక్ చేసుకుంటూ ఉండటం కీలకం.
ఆధార్ కార్డులో ఏమేం అప్డేట్ చేయవచ్చంటే..
ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి మార్పులు చేయవచ్చు. ఆధార్ కార్డులో లింగం మార్పు కూడా చేసుకోవచ్చు. కొన్ని మార్పులు పరిమితంగానే అనుమతిస్తారు. మరికొన్ని మార్పులు పలుమార్లు కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకు పేరు, లింగం మార్పు అనేది ఒకసారికి మాత్రమే అనుమతి ఉంటుంది. నివాస చిరునామాను ఎక్కువసార్లు మార్చుకోవచ్చు.
Also Read: ఆధార్, పాన్ లింక్‌కు ఇంకా టైముందా? ఎలా?